Oct 06,2023 21:22

ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా వెటర్నరీ జెడి వి.కోటేశ్వరరావు

పశువైద్యశాలలో జెడి తనిఖీలు
ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రభుత్వ పశువైద్యశాలను జిల్లా వెటర్నరీ జెడి వి.కోటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని కుర్రపల్లిలో ఉన్న ప్రభుత్వ పశువైద్యశాలను ఆయన తనిఖీ చేసిన అనంతరం వైద్యశాలలోని పలు రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మూగజీవాల సంరక్షణకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కల్పిస్తుందన్నారు.
ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ కార్యక్రమాలను పశుపోషకులకు ఉపయోగపడేలా అవగాహన కల్పించాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ పంచాయతీ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ ఎడి శశిధర్‌ సిబ్బంది పాల్గొన్నారు.