ప్రజాశక్తి-అనంతపురం రాష్ట్రంలో ప్రయివేట్ పాఠశాలలు రెన్యూవల్ గడువు మూడు సంవత్సరాలు నుంచి ఎనిమిది సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేయడంతో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ ప్రయివేటు పాఠాశాల యాజమాన్య సంఘం (ఆపుస్మా) రాష్ట్ర అధ్యక్షులు ఎంవి.రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా శనివారం నగరంలోని అపుస్మా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంలో తాను గెలిస్తే ప్రయివేటు పాఠాశాలల రెన్యూవల్ గడువును మూడేళ్ల నుంచి పదేళ్లకు పెంచాలని హామీ ఇచ్చానన్నారు. ఈ హామీ మేరకు గెలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో స్పందించిన సిఎం జగన్ జీవో 38ని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందుకు సిఎం జగన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, తన తోటి ఎమ్మెల్సీ కల్ప లతారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆపుస్మా జిల్లా అధ్యక్షుడు కుసుమ పుల్లారెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్ రామిరెడ్డి, సంజీవరెడ్డి, శశిభూషన్, కన్వీనర్ నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారెడ్డి, సభ్యులు రఘునాథరావు, తదితరులు పాల్గొన్నారు.
మిఠాయిలు పంచుకుంటున్న ఆపుస్మా నాయకులు










