May 15,2023 21:17

కార్యక్రమంలో మాట్లాడుతున్న జెఎన్‌టియు ప్రిన్సిపల్‌ పి.సుజాత

         ప్రజాశక్తి-అనంతపురం  పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ పి.సుజాత పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాల ఇసిఇ విభాగం సెమినార్‌ హాలులో 'పర్యావరణహిత జీవనశైలి' అనే కార్యక్రమంపై ఎంఎస్‌ఎస్‌ విభాగం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలన్నారు. అలాగే నీటిని వృథా చేయరాదని, విద్యుత్‌ వాడకాన్ని తగ్గించాలిన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆర్‌.భవాని, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఫ్లోరెన్స్‌ దీప, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ దామోదర్‌రెడ్డి, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ బ్రహ్మయ్య, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డి.విష్ణువర్ధన్‌,కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.