
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు బహుళ ప్రచారాన్ని కల్పించాలని జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు అన్నారు. నగరంలోని విశాఖ హైస్కూల్, శ్రీకాకుళం రూరల్ మండలంలోని రాగోలు ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థులతో యువ క్లబ్‌ను మంగళశారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్, పర్యాటకశాఖ కమిషనర్ ఆదేశాలను అనుసరించి యువ క్లబ్‌లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ పండగలు, జాతరలు, కళారూపాలపై యువతకు, భావితరాలకు తెలియజెప్పేలా అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించుకునేందుకు యువ క్లబ్‌లు దోహదపడతాయన్నారు. జిల్లాలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను వివరించారు. ముందుగా ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే అనార్థలు, పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటి సంక్షించడం తదితర అంశాలపై విద్యార్థులకు అవగహన కల్పించారు. కార్యక్రమంలో కూన మురళీకృష్ణ, జి.నిర్మల, వి.జగన్నాథమూర్తి, కె.వేణుగోపాల్, ఉపాధ్యాయలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.