Sep 12,2023 21:40

పంట నమోదును పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ

          ప్రజాశక్తి-ఆత్మకూరు    ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ సూచించా రు. మంగళవారం మండలంలోని పి.యాలేరులో రైతు శివానంద పొలం సర్వే నెంబర్‌ 470-ఎఫ్‌లో చేపట్టిన పంట నమోదు ను జిల్లా వ్యవసాయ అధికారిణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఉలవలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కావాల్సిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా కౌలు రైతులకు సిసిఆర్‌సి కార్డు కలిగిన రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పిఎం కిసాన్‌కు ఇకెవైసి చేయించుకోని రైతులు వెంటనే చేయించుకోవాలని కోరారు. దీంతోపాటు కొత్తగా రైతు భరోసా కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనుకున్న రైతులు ఈనెల 12వ తేదీలోపు చేయించుకోవాలనికోరారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌సి ఎడిఎ శైలజ, ఎఒ జి.సుచరిత, ఎఇఒ సుజిత, విఎఒ విద్య, రైతులు పాల్గొన్నారు.