Aug 18,2023 21:15

విలేకరులతో మాట్లాడుతున్న వైసిపి నాయకులు

       ప్రజాశక్తి-ఉరవకొండ   రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక తమ రాజకీయ ఉనికి కోసం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం నిర్వహించారు. ముందుగా వివిధ పథకాలతో లబ్ధిపొందిన మహిళలతో కలిసి సిఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే జాతీయ సర్వే సంస్థలు ఈటిజి-టైమ్స్‌ నౌ నిర్వహించిన సంయుక్త సర్వేలో రాష్ట్రంలో 51 శాతంపైగా ప్రజలు వైసిపికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తేలిందన్నారు. ఇది ఓర్చుకోలేని టిడిపి, జనసేన పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ వైసిపి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. వారి విమర్శలను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరన్నారు. చంద్రబాబు అండ్‌ కోకు ఈసారి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కరణం పుష్పావతి భీమ్‌రెడ్డి, జడ్పిటిసి హనుమంతు, వైస్‌ ఎంపిపి సునీత రామాంజనేయులు, వైసిపి నాయకులు కరణం భీమరెడ్డి, కొట్టాలపల్లి సర్పంచి రామాంజనేయులు, ఎఫ్‌ఎసిఎస్‌ ఛైర్మన్‌ శ్రీరాములు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు హేమవతి, డోనేకల్లు రమేష్‌, రాజశేఖర్‌, కేశన్న, చిట్టిబాబు, మాళాపురం గ్రామ నాయకులు రామాంజనేయులు, ఓబులప్ప, ప్రకాష్‌గౌడ్‌, వెంకటేష్‌, ఓబులేసు, నాగరాజు, నాగన్నగౌడ్‌, జయరామ్‌, బాలు, శ్రీరాములు, జగన్నాథ్‌, బుసప్ప, గజేంద్ర, కొట్టాలపల్లి ధనుంజయ, అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.