ప్రజాశక్తి - పాలకొల్లు
విద్యా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో పాలకొల్లు పట్టణం, పాలకొల్లు, పోడూరు, ఆచంట, యలమంచిలి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 7, 9 తరగతుల విద్యార్థులకు ప్రతిభాపాటవ, వ్యాసరచన పోటీలు స్థానిక ఎంఎంకెఎన్‌ఎం మున్సిపల్ పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. సమాఖ్య కార్యదర్శి పోలిశెట్టి శ్రీశ్రీ అధ్యక్షత వహించారు. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రతిభాపాటవ పరీక్షలను నిర్వహిస్తున్నామని, పరిసర మండలాల్లోని పాఠశాలల నుండి 550 మంది ఈ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షల విజేతలకు త్వరలో బహుమతి ప్రదానోత్సవ సభ ఏర్పాటు చేసి నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేస్తామని తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ సూర్యతేజ పరీక్ష పేపర్లను విడుదల చేశారు. తాను చిన్నప్పటి నుండి కలెక్టర్ కావాలనే చదివానని, ఆ ఆశయంతోనే కష్టపడి విజయం సాధించానని సూర్యతేజ తెలిపారు. విద్యార్థి దశ నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని కోసం కృషి చేయాలన్నారు. ఇంతమంది విద్యార్థులను ఒకచోటకు చేర్చి పరీక్షలు నిర్వహిస్తున్న విద్యా చైతన సమాఖ్య కృషి అభినందనీయమన్నారు. 40 మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పాల్గొని సేవలందించడాన్ని జెసి అభినందించారు. కార్యక్రమ నిర్వహణను తోలేటి గాంధీ, జన్మది నాగేశ్వరరావు, మంచెం ఉమామహేశ్వరరావు, మంచెం కనకరాజు, డివివి.ప్రసాద్, చేగొండి కరుణకుమార్, వంగా కరుణకుమార్, కంజరాపు దుర్గాప్రసాద్, కొంతేటి ఫణికుమార్, వర్ణనపు సుదీప్, పాఠశాల హెచ్‌ఎం అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించారు.










