Apr 10,2023 21:07

అడిషినల్‌ ఎస్‌పి సుబ్బరాజు
ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా స్పందనలో వచ్చిన ప్రతి వినతినీ పరిష్కరించాలని జిల్లా అడిషనల్‌ ఎస్‌పి ఎవి సుబ్బరాజు ఆదేశించారు. సోమవారం స్థానిక డిఎస్‌పి కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ స్పందన కార్యక్రమం జిల్లా నలుమూలల నుంచి 16 మంది వివిధ సమస్యలపై వచ్చి అడిషనల్‌ ఎస్‌పి తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ఆయన ఫిర్యాదులను ఆయా పరిధిలోని స్టేషన్లకు రిఫర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ తప్పక ధరించాలని సూచించారు.