Aug 26,2023 21:20

కార్యక్రమంలో మాట్లాడుతున్న జెఎన్‌టియు రిజిస్టార్‌ సి.శశిధర్‌

         ప్రజాశక్తి-అనంతపురం   ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థి జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా పారిశ్రామిక వేత్తగా తయారు కావాలని జెఎన్‌టియు రిజిస్టార్‌ సి.శశిధర్‌ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాలలోని మెకానికల్‌ సెమినార్‌ హాలులో కోఆర్డినేటర్‌ జి.మమత అధ్యక్షతన ప్రపంచ పారిశ్రామిక వేత్తల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిక జాతీయ విద్యావిధానం-2020 ప్రకారం విద్యార్థులు అభ్యశించే విభాగంలో సబ్జెక్ట్‌ నైపుణ్యంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా పారిశ్రామిక వేత్తలుగా తయారుకావాలన్నదే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి కె.రాజశేఖర్‌రెడ్డి, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఇ.అరుణకాంతి, భువన విజయ, బి.ఓం ప్రకాష్‌, కళ్యాణి రాధా, ఎం.అంకారావు, కె.ఎఫ్‌.భారతి, బి.షహీనా, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.