ప్రతి విద్యార్థి ఓ బ్రాండ్ అవ్వాలి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: స్థానిక విజయం సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల 19వ వార్షికోత్సవం ఎస్టేట్‌లోని ఆర్‌ఎల్‌ఎన్ ప్రారగణంలో 3,500 మంది విద్యార్థులతో ఘనంగా నిర్వహించారు. ఈవార్షికోత్సవానికి ప్రముఖ సినీనటుడు, నిర్మాత, దర్శకులు, రచయిత కెవి.ప్రసాద్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెవి.ప్రసాద్ సందేశం విద్యార్థులను ఉర్రూతలుగించింది. ప్రతి విద్యార్థి తనకు తాను ఒక బ్రాండ్ అవ్వాలని, ఆందుకు తగిన కృషిని ఎఎస్‌కె అనే ఆయుధంతో సాధించాలన్నారు. జీవితం పట్ల మంచి దృక్పధం, నైపుణ్యం, జ్ఞానం కలిగి ఉండాలన్నారు. ఇందుకోసం నితరం తననుతాను మలుచుకోవాలని సూచించారు. విజయం విద్యార్థుల క్రమశిక్షణ తనను ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు. విశిష్ట అతిధి విజయ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి సహజమైన తెలివితేటలు ఉంటాయని దానికి గుర్తించి అందరూ సద్వినియోగం చేసుకోలన్నారు. అంకుఠితమైన దిక్ష పట్టుదల ఉంటే సాధించలేదని ఏది ఉందన్నారు. రీజన్ మేనేజర్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కిషోర్‌కుమార్ రెడ్డి, విజయం విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి మాట్లాడుతూ విజయం కళాశాల ప్రారంభం నుంచి మూడు విషయాల్లో ఎవరికి అందనంత విజయాలు సాధిస్తోందన్నారు. మొదటిది విద్యార్థులకు చేరిక, రెండవది వార్షిక ఫలితాలు మూడవది ఉద్యోగ కల్పన ఈ మూడుడింటిలో కళాశాల ప్రారంభించిన 2003 నుండీ ఇప్పటి వరకు యూనివర్శటి పరిధిలో విజయం కాళాశాల సాధించిన అనుహ్యమైన ఫలితాలను విద్యార్థులకు తెలియజేస్తూ జీవితంలో క్రమశిక్షణ లేకుంటే ఏది సాధించలేమని ప్రతివిద్యార్థి తల్లిదండ్రులు, గురువులు తోటి విద్యార్థులను గౌరవిస్తూ తమకుతాము ఒక శక్తిగా ఎదిగి సమాజానికి దేశానికి సహాయపడాలన్నారు. డాక్టర్ శైలజామూర్తి కళాశాల వార్షిక నివేదికను సభకు అధించారు.










