Jun 16,2023 21:56

కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి ఉషశ్రీచరణ్‌

         ప్రజాశక్తి-కళ్యాణదుర్గం  రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద విద్యార్థీ ఉన్నత చదువులు చదవాలన్నదే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని మంత్రి ఉషశ్రీచరణ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మార్కెట్‌యార్డు ఆవరణలో జగనన్న ఆణిముత్యాలు, జగనన్న విద్యాకానుక నియోజకవర్గ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పేద విద్యార్థి అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో సిఎం జగన్‌ ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్‌ ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. వీటితోపాటు నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నిశాంత్‌రెడ్డి, ఎంఇఒ విజయలక్ష్మిలతోపాటు ఆయా శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లితండ్రులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.