ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి
పివికెఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆనందరెడ్డి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఆరోగ్యంగా ఉన్న ప్రతిఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని స్థానిక పివికెయన్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆనంద రెడ్డి పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఆజాదీకా అమత్ మహౌత్సవాలలో భాగంగా స్థానిక పివికెయన్ ప్రభుత్వ కళాశాలలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. చిత్తూరు రెడ్‌క్రాస్ సభ్యులు, పివికెయన్ విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలకు పండ్లు, బిస్కెట్లు, జ్యూస్‌లు అందజేశారు. కార్యక్రమంలో వైఆర్‌సి కోఆర్డినేటర్ ఎం ఇస్మాయిల్, ఆర్‌ఆర్సి కోఆర్డినేటర్ డాక్టర్ తేజమూర్తి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ మోహన్ బెహరా, తదితరులు పాల్గొన్నారు.










