ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయండి
ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్:18 సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, ట్రైనీ కలెక్టర్ వై.మేఘ స్వరూప్, డిఆర్‌ఒ ఎన్.రాజశేఖర్ తో కలసి ప్రత్యేక ఓటర్ల జాబితాసవరణ 2023 పై తహశీల్దార్‌లు, ఎంపీడీఓలు, బిఎల్‌ఒలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు..ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, 17- 18 వయసుగల వారి వద్ద నుండి అడ్వాన్స్ ఫారంను సేకరించాలని తెలిపారు. నవంబర్ 9న ప్రకటించిన ఓటర్ల ముసాయిదా జాబితాకు ముందు ఉన్న అన్ని ఫార్మ్స్‌ను పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఫారం- 6 పెండెన్సీపై దృష్టి పెట్టాలని, దీనిని త్వరగా పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో గల సచివాలయ లలోని బిఎల్‌ఓలు వెరిఫికేషన్ ప్రక్రియను డిసెంబర్ ఐదో తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కొన్ని పోలింగ్ స్టేషన్‌లలో ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ తక్కువగా కలదని ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటర్ అను సంధాన ప్రక్రియను డిసెంబర్ 10వ తేదీ లోపు పూర్తి చేయా లని తెలిపారు. ఈ వీడియో కాన్ఫ రెన్స్ కుపుంగనూరు, జి.డి నెల్లూరు, చిత్తూరు,ఈఆర్‌ఓ లు ప్రభాకర్ రెడ్డి, భవాని, రేణుక, పర్వీన్,ఎలక్షన్ సెక్షన్ డిటి పార్థసారథి, ఎలక్షన్ విభాగం సిబ్బంది, తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై పర్యవేక్షణ తప్పనిసరి
పూతలపట్టు: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనం అందించా లని.. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ సూచించారు. శుక్రవారం పూతలపట్టు మండలంలో కలెక్టర్ విస్తతంగా పర్యటించి పలు పథకాల అమలు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తొలుత పూతలపట్టు మండలం తలుపులపల్లి జడ్పీ హైస్కూల్‌లో నాడు- నేడు పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రధానోపా ధ్యాయులను ఆదేశించారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరంగా భోజనం అందించాలని ఆదేశించారు. విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం పాటూరు గ్రామంలో సచివాలయాన్ని తనిఖీ చేశారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి సూచనలు చేశారు. తహసీల్దారు విజయభాస్కర్, ఎంపీడీవో గౌరీ, డీఈ హౌసింగ్ సుబ్రహ్మణ్యం, మెడికల్ ఆఫీసర్ ప్రియాంక, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈలు వెంకటప్రసాద్, శంకర్, ఎంఈవో కష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.










