ప్రజాశక్తి - కాళ్ల
పేదరికమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. కోపల్లె గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం 4వ రోజు శనివారం నిర్వహించారు. జగనన్న కాలనీలో రూ.14.50 లక్షలతో నిర్మించిన అప్రోచ్ రోడ్లను, రూ.25 లక్షలతో నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ను పివిఎల్ ప్రారంభించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపిపి పెన్మెత్స శిరీష విశ్వనాథరాజు, జెడ్‌పిటిసి పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, సర్పంచుల ఛాంబర్ జిల్లా అధ్యక్షులు కొలుకులూరి ధర్మరాజు, సొసైటీ బ్యాంక్ ఛైర్మన్లు పాల్గొన్నారు.










