Jul 27,2022 22:07

ప్రతి కుటుంబానికీ లబ్ది : ఎమ్మెల్సీ భరత్‌
ప్రజాశక్తి- శాంతిపురం:
వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ మూడేళ్ల పాలనలో కుల,మత, రాజకీయ వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి లబ్ధిచేకూరిందని ఎమ్మెల్సీ భరత్‌ అన్నారు. మండల పరిధిలో ఎంకెపురం గ్రామపంచాయతీ పరిధిలో రెండవరోజు బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్‌ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి అందిన సంక్షేమ ఫలాల వివరాలు తెలియజేస్తూ కరపత్రాలను పంచారు. అలాగే గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల గురించి తెలుసుకుంటూ వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసులు, ఎంపీపీ కె.వసుంధర కోదండ రెడ్డి, మండల కన్వీనర్‌ బుల్లెట్‌ దండపాణి, రెస్కో మాజీఅధ్యక్షులు చక్రపాణిరెడ్డి, నాయకులు గజ్జెల రమేష్‌, మురళీమోహన్‌ రెడ్డి, వినోద్‌, వైస్‌ఎంపీపీలు సరస్వతీ, రమేష్‌ టివి పట్టాభి, స్థానిక సర్పంచ్‌ తేజామోహన్‌, సర్పంచులు ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.