Aug 23,2022 21:37

ప్రతి కుటుంబానికి లబ్ధి
గడపగడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్సీ భరత్‌
ప్రజాశక్తి- శాంతిపురం :
వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ మూడేళ్ల పాలనలో కుల,మత రాజకీయ వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని ఎమ్మెల్సీ భరత్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బెల్లికోకిలలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్‌ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా ఆయా కుటుంబాలకు అందిన సంక్షేమ ఫలాల వివరాలు తెలియజేస్తూ కరపత్రాలను పంచారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలగురించి తెలుసుకుంటూ వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరాతీశారు. ఆయన వెంట జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసులు, ఎంపీపీ కె.వసుంధర కోదండ రెడ్డి, మండల కన్వీనర్‌ బుల్లెట్‌ దండపాణి, రెస్కో మాజీ అధ్యక్షులు చక్రపాణి రెడ్డి, నాయకులు గజ్జెల రమేష్‌, మురళీ మోహన్‌రెడ్డి, వినోద్‌, వైస్‌ఎంపీపీలు సరస్వతీ, రమేష్‌ టివి.పట్టాభి, స్థానిక సర్పంచ్‌ తేజా మోహన్‌, సర్పంచులు ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు, రాష్ట్ర ఒక్కలిగ సంఘం డైరెక్టర్‌ విశాలాక్షి సుకుమార్‌, మండల స్టేట్‌ డైరెక్టర్లు కష్ణమూర్తి, చెంగప్ప, పెద్దన్న వైసిపి అనుబంధ సంఘ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.