ప్రజాశక్తి-అనంతపురం క్రైం నమోదు చేసిన ప్రతి కేసులో నిందితులను గర్తించి శిక్ష పడేలా పోలీసులు, ఏపీపీలు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశించారు. శనివారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని పోలీసు అధికారులు, ఏపీపీలు, కోర్టు కానిస్టేబుళ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నేర నిరూపణ కాకుండా కొట్టివేసిన కేసులు, అందుకు కారణాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలు చేసిన ప్రతి ఒక్కరికీ శిక్షలు పడితే భవిష్యత్తులో నేరాల జోలికి వెళ్లకుండా ఉంటారన్నారు. అదే సమయంలో ప్రజల్లో భరోసా కలుగుతుందన్నారు. ఆ దిశగా అందరం సమన్వయంతో ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఆర్.రామిరెడ్డి, జి.రామకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రామ్‌నాయక్, డీఎస్పీలు, సీఐలు, లీగల్ అడ్వైజర్ విష్ణువర్ధన్, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎస్పీ కె.శ్రీనివాసరావు










