Apr 17,2023 21:35

మహిళకు కరపత్రం అందజేస్తున్న విప్‌ కాపు రామచంద్రారెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ

         ప్రజాశక్తి-రాయదుర్గం రూరల్‌  వైసిపి అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు విప్‌ కాపు రామచంద్రారెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ తెలిపారు. మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు సంక్షేమ పథకాలపై ఆరాతీశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఇందులో భాగంగా స్థానికులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇఒఆర్‌డి రఘురాంరావు, వైసిపి నాయకులు కదరంపల్లి బాబులు, పంచాయతీ కార్యదర్శి కొల్లప్ప, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.