Sep 10,2022 23:03

ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలే లక్ష్యం
డిప్యూటీ సిఎం కళత్తూరు నారాయణ స్వామి
ప్రజాశక్తి- ఎస్‌ఆర్‌ పురం:
ప్రతిఇంటికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. మండలంలోని పుల్లూరు గ్రామపంచాయతీ పుల్లూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ నవరత్నాలలో భాగంగా ప్రతి కుటుంబంలో ఎవరికో ఒకరికి ఏదోఒక పథకం ద్వారా పేదలు లబ్ధి పొందాలని ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అదేవిధంగా గ్రామ ప్రజల సమస్యలను కనుక్కొని వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్‌చైర్మన్‌ ఎంసి విజయనంద రెడ్డి, చిత్తూరు డిసిసి బ్యాంక్‌ డైరెక్టర్‌ బాలసుబ్రమణ్యం రెడ్డి, జడ్పిటిసి రమణ ప్రసాద్‌రెడ్డి, మాజీ జెడ్పిటిసి గురువారెడ్డి, మండల అధ్యక్షులు అనంతరెడ్డి, స్థానిక ఎంపీటీసీ చంద్రశేఖర్‌, సర్పంచ్‌ భవ్యశ్రీ, నాయకులు జనార్ధన్‌, మణి, హరి ప్రసాద్‌రెడ్డి, గుర్రప్ప, విజయబాబు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి ప్రమీల, ఎమ్మార్వో షబీర్‌ బాషా, ఇంచార్జ్‌ ఎంపీడీఓ కష్ణయ్య, నియోజకవర్గ మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.