Aug 28,2022 23:08

ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీరు : మంత్రి పెద్దిరెడ్డి
ప్రజాశక్తి - సోమల :
నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి 24 గంటలు తాగునీరు అందించే విధంగా గండికోట రిజర్వాయర్‌ నుండి ప్రత్యేక పైప్‌లైన్‌ తీసుకువచ్చి ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించి వాటి ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ పడమటి ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో రెండు అతిపెద్ద రిజర్వాయర్లు నిర్మించి వాటి ద్వారా చెరువులకు సాగునీటిని సరఫరా చేసి ప్రతి రైతు ఏడాదికి మూడు పంటలు పండించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన సోమల సొసైటీ భవనం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేపడుతున్న అనేక రకాలైన ప్రజా సంక్షేమ పథకాలు ఆర్థిక సహాయాలు చూసి ఆకర్షితులై పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వారందరినీ కూడా సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. రాబోయే ఎన్నికలలో జగన్మోహన్‌ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త నాయకులు ప్రజాప్రతినిధులు పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తన 40ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్నానని అధికారపార్టీకి, ముఖ్యమంత్రిలకు వ్యతిరేకంగా ఉంటూ నియోజకవర్గం అభివద్ధిలో కాస్త వెనకడుగు పడ్డామని, అయితే జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఈ మూడు సంవత్సరాలలో పుంగనూరు నియోజకవర్గంపై ప్రత్యేక దష్టి సారించి అభివద్ధిపరంగా ముందుకు తీసుకు వెళుతున్నామని ప్రతి గ్రామంలో సిమెంట్‌ రోడ్ల నిర్మాణం మురుగునీటి కాలువల నిర్మాణం చేపట్టి గ్రామీణ ప్రాంతాలను అభివద్ధి చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా మరెన్నో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టి వాటిని పూర్తి చేస్తున్నామని నిధుల కొరత వల్ల బిల్లులు చెల్లించడంలో ఆలస్యం జరిగినా మరో 10రోజులలో పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఇందులో పింఛన్లు రేషన్‌ కార్డుల మంజూరు ఇతర సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని వీటన్నిటిని చూసి ఆకర్షితులై పలువురు వైసిపి తర్థం పుచ్చుకుంటామని ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి అధ్యక్షులు గంగాధర రాయల్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరావు, నాయకులు రవీంద్రారెడ్డి, బాలు, సూరి రెడ్డి, బగ్గిడి నాగరాజా, కరకమంద వాసు దేవయ్య, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి పెద్దిరెడ్డి పాల్గొన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో టిడిపి నేతలు వైసీపీలో చేరిక
మండల కేంద్రమైన సోమలలోని పలువురు టిడిపి ముస్లిం నేతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కండువాలను ధరించి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. అలాగే సోమల సహకార సంఘం భవనం వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఆదివారం ఇరికిపెంట సోమలకు చెందిన 100 మందికి పైగా టిడిపి నేతలు కార్యకర్తలు వైసిపి తీర్థాన్ని పుచ్చుకొని మంత్రిచే వైసీపీ కండువాలను కప్పించుకున్నారు. సోమల మాజీ సర్పంచ్‌ శ్రీరాములు, వరదం వెంకటరమణ, ఎంపీపీ ఈశ్వరయ్య, ఏఎంసీ మాజీచైర్మన్లు అమాసమోహన్‌, నాగేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ ప్రభాకర, సర్పంచులు సుండు రాజేశ్వరి, రెడ్డప్ప, వెంకటరమణ, సురేంద్ర రెడ్డి, ఎంపీటీసీ సర్వేశ్వరమ్మ, కళ్యాణి పాల్గొన్నారు.