ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు: డిప్యూటీ సిఎం
ప్రజాశక్తి- కార్వేటినగరం: జగనన్న ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు వివరిస్తూ, వారు చెప్పే సమస్యలు తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని డిప్యూటీ సిఎం కళత్తూరు నారాయణ స్వామి అధికారులను ఆదేశించారు. ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సిడికండ్రిగ, కోదండ రామపురం, దళితవాడ, ఒడ్డిఇండ్లు, టికెఎం.పేట ఇంటింటా తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటికీ లక్ష నుండి 7లక్షల వరకు లబ్ధి పొందుతున్నారని వివరించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రం ఎంతో అభివద్ధి చెందుతుందని అన్నారు. ఇల్లు లేని లబ్ధిదారులకు ఇంటి పట్టా ఇచ్చి ఇల్లు నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. సిడికండ్రిగలో డ్రైనేజీ కాలువలు నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ మంగమ్మ మంత్రిని కోరారు. మంత్రి స్పందిస్తూ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకటైన గెలిచే జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న కుట్రలను ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదన్నారు. 2024 లో మళ్లీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని తెలిపారు. ఈసందర్భంగా గ్రామపెద్ద లక్ష్మీపతిరెడ్డి మంత్రి నారాయణస్వామిని నాయకులను శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ లతబాలాజీ, మండల కన్వీనర్ శేఖర్‌రాజు, మండల కోఆప్షన్ మెంబర్ పట్నం ప్రభాకర్‌రెడ్డి, మండల జెసిఎస్ కన్వీనర్ పురంధర్, సింగిల్ విండో అధ్యక్షులు లోకనాథ్‌రెడ్డి, తూడ మాజీ ప్లానింగ్ అధికారి కష్ణారెడ్డి, సర్పంచులు మంగమ్మ, గోవిందయ్య, ధనంజయవర్మ, ఎంపీటీసీ నందిని, తదితరులు పాల్గొన్నారు.










