దీక్షలు చేస్తున్న టిడిపి నాయకులు
ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:అహింస అనే ఆయుధంతో భారతదేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిన ఆదర్శనీయుడు బాబూజీ అని ఆయన అందరికీ ఆదర్శనీయుడని మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టిడిపి పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రమేష్ రెడ్డిలు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అనురాధ, విజేత రెడ్డిలతో కలిసి వారు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం బాబుతో నేను రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి నియంత పాలన సాగిస్తున్నారన్నారు.కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు షేక్ కరీముల్లా, టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ధర్మవరం సుబ్బారావు,కంభం విజయరామిరెడ్డి, నేతలు శివప్రసాద్, బాలాజీ, తిరుమల నాయుడు, జహీర్, ప్రసాద్, జి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.










