ప్రజాశక్తి - అనంతపురం కలెక్టరేట్ అనంతపురం జిల్లా కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. పరీక్షా కేంద్రాలను యుపిఎస్‌సి అబ్జర్వర్, ఎపిఐఐసి వైస్‌ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ప్రవీణ్ కుమార్, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ తో కలిసి పరిశీలించారు. ఎస్‌కెయు, ఎస్‌ఎస్‌బిఎన్ ్ డిగ్రీ కళాశాలల్లో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులకు ఏర్పాటు చేసిన వసతులపై ఆరా తీశారు. ఆదివారం ఉదయం నిర్వహించిన 8 పరీక్షా కేంద్రాలలో 3213 మంది అభ్యర్థులకుగాను 1814 మంది హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన 8 పరీక్షా కేంద్రాలలో 3213 మంది అభ్యర్థులకుగాను1788 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కుశాల్ జైన్, అనంతపురం ఎపిఐఐసి జోనల్ మేనేజర్ వరప్రసాద్, ఆర్‌డిఒ మధుసూదన్, ఆన్‌సెట్ సిఇఒ కేశవ నాయుడు, జిల్లా టూరిజం అధికారి నాగేశ్వర రెడ్డి, ఇతర అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న అబ్జర్వర్ ప్రవీణ్‌కుమార్










