ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్షలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. చిత్తూరు కేంద్రంగా 3,900మంది పరీక్ష రాయాల్సి ఉండగా వారి కోసం 11 కేంద్రాలను పట్టణంలోని వివిధ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం మొత్తం 11 కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,900మంది దరఖాస్తు చేసుకోగా 2265మంది పరీక్షలను రాయడం జరిగింది. మరో 1,635 మంది గైర్హాజరు అయ్యారు. మొత్తం 58.07శాతం మంది పరీక్షలకు హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాకలెక్టర్ పట్టణంలోని విజయం జూనియర్ కళాశాల, శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, అపోలో మెడికల్ కాలేజీ, శ్రీశ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షల నిర్వహణ విధానంను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ పరీక్షలకు సంబంధించి జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.రాజశేఖర్‌తో పాటు ఇతర అధికారులను నియమించారు. కువైట్ నిబంధనలను అనుసరించి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి పరీక్షలను నిర్వహించారు.










