May 20,2023 21:48

పరీక్ష కేంద్రాలను డిఇఒ సాయిరాం

          ప్రజాశక్తి-అనంతపురం సిటీ   జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఎపి ఆర్‌జెసి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇందులో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను డిఇఒ సాయిరాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఇఒ మాట్లాడుతూ ఉదయం జరిగిన క్యాట్‌ ప్రవేశ పరీక్షకు 5747 మందికి 4679 మంది, మధ్యాహ్నం జరిగిన ఎపి ఆర్‌జెసి జెసి, డిసి ప్రవేశ పరీక్షకు 7890 మందికి 6468 మంది హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎసి గోవింద్‌నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.