Oct 05,2023 19:26

నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు

నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు
ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి..
ప్రజాశక్తి-ఉదయగిరి:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ను ఉమ్మడి తెలుగు రాష్ట్రమే కాక ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తూ మద్దతు తెలుపుతున్నాయని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ జెడ్‌పి చైర్మన్‌ చెంచల బాబు యాదవ్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక నరసింహ కాంప్లెక్స్‌ ఎదుట చేపట్టిన నిరసన విలే దీక్షకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టయి నాటికి 25 రోజులు గడిచాయన్నారు. బుధవారం నెల్లూరులో చేపట్టిన గాంధీజీకి వినతి పత్రం అందజేశారు. ప్రజలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్యం రాజ్యాంగం బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం లేదని సైకో జగన్మోహన్‌ రెడ్డి ఏర్పాటు చేసిన రాజ్యాంగం నడుస్తుందని విముక్తి కలిగించాలని గాంధీజీకి వినతి పత్రం అందజేశామన్నారు
.కార్యక్రమంలో మండల కన్వీనర్‌ చింతనబోయిన బయన్న, మాజీ జెడ్‌పిటిసి కలివేల జ్యోతి, మైనార్టీ నాయకులు రియాజ్‌, రైతు సంఘం నాయకులు బొజ్జ నరసింహులు, రాజా వెంకటస్వామి మధు అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.