Mar 08,2023 21:31

మున్సిపల్‌ కమిషనర్‌ శివరామకృష్ణ
ప్రజాశక్తి - భీమవరం
ప్రతి విద్యార్థీ ప్రణాళికాబద్ధంగా చదివితే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారని మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ సూచించారు. స్థానిక సిఎస్‌ఎన్‌ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమిషనర్‌ శివరామకృష్ణ మాట్లాడారు. విద్యార్థులు ఉన్నతిగా ఆలోచించి ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిం చారు. విద్యార్థి దశలో విద్య ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమన్నారు. దీన్ని గమనంలో ఉంచుకున్న ప్రతి విద్యార్థి భవిష్యత్త్తూ పూల బాటవుతుంన్నారు. అనంతరం నెట్‌బాల్‌ క్రీడలో నేషనల్‌ స్థాయికి ఎంపికైన కె.భరత్‌, జి.శిరీష, లావణ్యను అభినందించి సత్కరించారు. అనంతరం కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్‌ డాక్టర్‌ చీడే సత్యన్నారాయణ, జాయింట్‌ సెక్రటరీ, నలుపు గోపి, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎమ్‌డి సలీమ్‌ ఖాన్‌, జిబి సభ్యులు గాదిరాజు, సత్యనారాయణరాజు, స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఎన్‌.నిర్మల కమిషనర్‌ను సత్కరించారు.