May 11,2023 22:03

మహిళతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

       ప్రజాశక్తి-అనంతపురం   నగరంలో ప్రణాళి కాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతూ ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గురువారం నగరంలోని 6వ డివిజన్‌లో కార్పొరేటర్‌ సుజాతతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించడంతోపాటు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతిహామీని అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందని, కానీ తాము అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎలా చేరువ అవుతున్నాయో తెలుసుకునేందుకే గడప గడపకూ వెళ్తున్నామన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20లక్షలతోపాటు ఇతర నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ముఖ్యంగా రోడ్లు, డ్రెయినేజీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ వసీం, కమిషనర్‌ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ ఫయాజ్‌, ఆర్టీసీ రీజినల్‌ ఛైర్‌పర్సన్‌ మంజుల, రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గౌస్‌బేగ్‌, బీసీ జోనల్‌ అధ్యక్షుడు బీసీ రమేష్‌గౌడ్‌, అనుబంధ సంఘాల అధ్యక్షులు శ్రీదేవి, సైఫుల్లా బేగ్‌, మదన్‌మోహన్‌రెడ్డి, జేసీఎస్‌ కన్వీనర్‌ ఆలుమూరు శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.