May 27,2023 22:22

డిఇఒ వెంకటరమణకు యుటిఎఫ్‌ వినతిపత్రం
ప్రజాశక్తి - భీమవరం

            ప్రసుత్తం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రమోషన్స్‌ కౌన్సెలింగ్‌ మాన్యువల్‌గా ఇవ్వాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఎస్‌.విజయరామరాజు, ఎకెవి.రామభద్రం కోరారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖాధికారి వెంకటరమణకు యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బదిలీ పాయింట్స్‌, రిఅపార్షన్‌ విషయంలో, నిబంధనల ప్రకారం పాయింట్స్‌ కేటాయించాలన్నారు. 2015 సంవత్సరానికి చెందిన ఉపాధ్యాయులకు పూర్తి పాయింట్స్‌ కేటాయించాలన్నారు. బదిలీ ఉపాధ్యాయులకు, ప్రమోటిస్‌ ఉపాధ్యాయులకు అన్ని ఖాళీలు చూపించాలని, ఖాళీలను బ్యాక్‌ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు. ప్రీహైస్కూల్స్‌లో హిందీ, తెలుగు ఉపాధ్యాయులు లేకపోతే, ఆ స్థానంలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయిలను కేటాయించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు ఎం.రాజశేఖర్‌, కార్యదర్శులు క్రాంతి కుమార్‌, జి.రామకృష్ణంరాజు, కె.త్రిమూర్తులు, పి.శ్రీనివాసరాజు, ఇడివి.ప్రసాద్‌, పి.రామమూర్తినాయుడు, పివి.సత్యనారాయణ, పి.బాలరాజు ఉన్నారు.