Oct 26,2023 21:40

వేలాడుతున్న కరెంటు తీగలు

వేలాడుతున్న కరెంటు తీగలు
ప్రమాదకరంగా కరెంటు వైర్లు
భయాందోళనలో ప్రజలు
ప్రజాశక్తి-వరికుంటపాడు:మండలంలోని తూర్పు బోయమడుగుల గ్రామం ఊరబావి సమీపంలోని పొలాలకు వెళ్లే దారిలో విద్యుత్‌ తీగలు కిందకి వేలాడుతున్నాయని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై గతంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ పరిస్థితిని గమనించి విద్యుత్‌ తీగలను సరిచేయాలని ఈ ప్రాంత రైతులు ప్రజలు కోరుతున్నారు. చేతికి అందే ఎత్తున ఈ తీగలు ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.