Oct 19,2023 21:07

ప్రజా బ్యాలెట్‌లో పాల్గొన్న జనం

ప్రజాశక్తి-నెల్లూరు ::కేంద్ర ప్రభుత్వ షరతులకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తుందని వామపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పేర్లతో విద్యుత్‌ ఛార్జీలను పెంచి సామాన్యులపై ఆర్థిక భారాలను మోపడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ప్రజా బ్యాలెట్‌ పేరుతో గురువారం ప్రజాభిóప్రాయ సేకరణ చేపట్టాయి. సిపిఎం, సిపిఐ, సి.పి.ఐ (యం.ఎల్‌ ) న్యూడెమోక్రసీ తదితర వామపక్ష పార్టీల నగర కమిటీల ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో, రూరల్‌ కమిటీల ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన ఆర్‌టిసి బస్టాండ్‌ ఎదుట ఈ ఈ ప్రజా బ్యాలెట్‌ జరిగింది. నగరంలో ఆత్మకూరు బస్టాండు వద్ద విద్యుత్‌ ఛార్జీలు పెంచడంపై ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా ప్రజా బ్యాలెట్‌ కార్యక్రమాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, సిపిఐ నగర కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయిలు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణలు తీసుకురావడం, వాటిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహం చూపి అమలు చేస్తుందన్నారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం ఈ విద్యుత్తు సంస్కరణలు అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచడం వల్ల , పెట్రోల్‌ , డీజల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, రవాణా చార్జీలు పెరగటం వల్ల నిత్యావసర వస్తువుల ధరలకు అదుపులేకుండా అనంతరం ప్రజా బ్యాలెట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఓటింగ్‌ ప్రక్రియలో 841 మంది ప్రజలు ఓటు ద్వారా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అనంతరం పోలైన ఓట్లను వామపక్షపార్టీల నాయకులు లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో 831 మంది విద్యుత్‌ ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. 10 మంది మాత్రమే విద్యుత్‌ ఛార్జీల పెంపుదలకు సమ్మతిని తెలియజేస్తూ ఓటింగ్‌ వేశారు. ఈ తీర్పుతో రాబోవు ఎన్నికలలో ప్రభుత్వానికి ప్రజలు ఏవిధంగా బుద్ధి చెప్పనున్నారో స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఊరట కలిగించే విధంగా కరెంటు చార్జీలను తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సి.పి.ఐ (యం), నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ,నాయకులు జి.నాగేశ్వరరావు ,పి. సూర్యనారాయణ, ఎస్‌కె.మస్తాన్‌భీ, డివైఎఫ్‌ఐ నాయకులు ఎం.వి.రమణ, బి.పి నరసింహా, మహిళా నాj ుకురాలు కత్తి పద్మా, ఏ.శ్రీనివాసులరెడ్డి, మూలం ప్రసాద్‌, అత్తిమూరు శ్రీనివాసులు, ఆర్‌.నగేష్‌, ఎస్‌.అంకయ్య, సి.పి.ఐ సీనియర్‌ నాయకులు వి.రామరాజు, కె.ఆంజ నేయలు , సి.పి.ఐ (యం.ఎల్‌ ) న్యూడెమోక్రసీ నాయకులు సాగర్‌, కె.రాంబాబు , సిరాజ్‌ , వాటంబేటి నాగేంద్ర, షేక్‌.ముక్తియార్‌ , కె.సతీష్‌, కె.స్టాలిన్‌ , వి.ప్రత్యూష్‌ ,సుబ్బరాయుడు , టి.సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.