ప్రజాశక్తి-అనంతపురం ప్రజల్లో ప్రతికూల ఔషధ ప్రతిచర్య పర్యవేక్షణ తప్పనిసరి అని పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ కెఎస్‌ఎస్‌వెంకటేశ్వరరావు సూచించారు. గురువారం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫార్మకాలజీ విభాగం హెచ్‌ఒడి షారోన్ సోనియా ఆధ్వర్యంలో 3వ జాతీయ ఫార్మకో విజిలెన్స్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం వాడే మందులు వల్ల ఏవైనా ప్రతికూల చర్యలు, ఎలర్జీలు లాంటివి కలిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800 180 3024ను సంప్రదించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ప్రతి ఆసుపత్రిలో ఎడిఆర్ బాక్సులను ఉంచుతున్నామన్నారు. మీ విలువైన సలహాలు, సూచనలను ఉత్తరాల ద్వారా అందులో వేసి తెలియజేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్లు డాక్టర్ భీమసేనాచారి, డాక్టర్ వేముల శ్రీనివాసులు, డాక్టర్ మల్లేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కెఎల్.సుబ్రమణ్యం, ఫారా కళాశాల డాక్టర్లు ఆశాలత, పద్మ శ్రావణి, రియాజ్, కుష్బూ, ఫర్హానా, ఫిరోజ్, శివకుమార్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు










