Apr 30,2023 08:58

ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులు, ప్రజలు

            గుంతకల్లు : విద్యుత్తు కోతలను ఎత్తివేసి ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని సిపిఎం పట్టణ కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమే రకు శనివారం స్థానిక ఆలూరు రోడ్డులో ఉన్న విద్యు త్‌ శాఖ డిఎఇ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వేసవిలో ఉక్కపోతతో ప్రజలు అల్లాడు తుంటే విద్యుత్‌ శాఖ అధికారులు మాత్రం కోతలు వి ధించడం బాధాకరమన్నారు. బిల్లులు మాత్రం గతం లో కన్నా రెండింతలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. రాత్రి వేళల్లో ప్రజలు మరీ ఇబ్బందులు పడుతున్నా రన్నారు. అంతేగాకుండా అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ హెచ్చు,తగ్గులు సరఫరా అవుతుండటంతో ఇళ్లల్లోని ఎలక్ట్రికల్‌ వస్తువులు కాలిపోతున్నాయన్నారు. అలాగే విద్యుత్‌ కోతల కారణంగా రాత్రి సమయంలో చోరీలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికైన విద్యుత్‌ అధికారులు స్పందించి విద్యుత్‌ కోతలను నిరోధించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యవర్గ సభ్యులు దాసరి శ్రీనివాసులు, మారుతీప్రసాద్‌, జగ్గలి రమేష్‌ బాబు, కమిటీ సభ్యులు రామునాయక్‌, ఓబులేసు, అబ్దుల్లా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.