ప్రజాశక్తి - ఏర్పేడు: ప్రజల పట్ల ప్రతి ఒక్కరూ మంచిగా మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఏర్పేడు మండల భవన సముదాయం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఎంపీపీ గీత అధ్యక్షతన, ఇన్చార్జి మండల విస్తరణ అధికారి బాల సుబ్రహ్మణ్యం రెడ్డి పర్యవేక్షణలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకాళహస్తి సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డికి మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. మండలంలోని వివిధ విభాగాల మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. గత సర్వసభ్య సమావేశంలోని పలు సమస్యలపై చేపట్టిన చర్యలు ను అధికారులు ఎమ్మెల్యేకి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలంలోని ప్రజా ప్రతినిధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కార దిశగా కార్యాచరణ చేపడతామని ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దష్టికి తీసుకొనివస్తే, సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు కావాల్సిన సేవలను త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. అలాగే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజల పట్ల ప్రతి ఒక్కరూ మంచిగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తన ఫోన్ నెంబర్‌కు నేరుగా కాల్ చేసి తెలియజేయవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి కిషోర్ కుమార్ రెడ్డి, సింగిల్విండో చైర్మన్ జనార్ధన్ యాదవ్, వైస్ ఎంపీపీలు జమ్మల శ్రీనివాసులు, తిరుపతి జనార్దన్ రెడ్డి, సింగిల్ విండో కో ఆప్షన్ సభ్యులు భత్తి శెట్టి, సర్పంచుల సంఘం అధ్యక్షులు నల్ల పాలెం శివయ్య, మండల కన్వీనర్ పాతగుంట గురువారెడ్డి, మండలంలోని సర్పంచులు, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.










