ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
ప్రజల పై అదనపు భారం మోపొద్దు
సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్
ప్రజాశక్తి-నెల్లూరు:పేద మధ్యతరగతి ప్రజలపై మోయలేని విధంగా కరెంటు చార్జీల భారాలను మోపారని సిపిఐ నగర సహాయ కార్యదర్శి సిరాజ్ విమర్శించారు. శనివారం నగరంలోని జన్నత్ హుస్సేన్ నగర్ పెట్రోల్ బంక్ ప్రాంతంలో వామపక్ష నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన కరెంటు చార్జీలు తగ్గించే వరకు వామపక్షాల ఆధ్వర్యంలో ఈనెల 9 నుండి16 తేదీ వరకు పోరాటాలు చేస్తామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎన్నికలు అయిన తర్వాత అధికార దాహంతో ఇచ్చిన హామీలు మర్చిపోవడం ఆదాని లాంటి ధనవంతులకు లాభం చేకూర్చే విధంగా స్మార్ట్ మీటర్లు తయారీ అప్పజెప్పడం బిజెపి తానా అంటే తందానా అనడం సిగ్గుచేటు పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలి స్మార్ట్ మీటర్లు, మోటార్లకు మీటర్లు ప్రక్రియ మానుకోకపోతే 2024 ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షానవాజ్, రెండవ డివిజన్ సిపిఐ కార్యదర్శి షబ్బీర్, వెంకటేశ్వర్లు, సయ్యద్, రియాజ్, రమణయ్య, మహేశ్వర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.










