Jun 09,2022 22:51

మాట్లాడుతున్న అనతపురం రేంజ్‌ డిఐజి రవి ప్రకాష్‌

ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్‌
'పోలీసుల పని తీరు ప్రజల మన్ననలు పొందేట్లుగా ఉండాలని, ఎఆర్‌ సిబ్బంది నిరంతర విద్యార్ధి గా శిక్షణలు తీసుకోవాలని, మీ పనితీరు పై శాంతి భద్రతల పరిరక్షణ ఆధారపడి ఉంటుంది' అని అనతపురం రేంజ్‌ డిఐజి రవి ప్రకాష్‌ అన్నారు. చిత్తూరు జిల్లా ట్రైనింగ్‌ సెంటర్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ నందు నిర్వహించిన ఇన్‌స్పెక్షన్‌ పెరేడ్‌ కు డిఐజి ముఖ్య అతిధిగా హాజరై ఏ.ఆర్‌ సిబ్బంది, అధికారులచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ పెరేడ్‌ బహు చక్కగా నిర్వహించారని అభినందిస్తూ ఎఆర్‌ విభాగం జిల్లా పోలీసు శాఖలో కీలకమైనదని, ఎఆర్‌ బలగము జిల్లా బలగానికి వెన్నెముఖ లాంటిదని, అత్యవసర పరిస్థుతులలో, శాంతి భద్రతల పరిరక్షణలో ఎఆర్‌ పనితీరు కీలకం అని అన్నారు. ప్రజలతో మన ప్రవర్తన హుందా గా ఉండాలని, సంయమనం పాటించాలని, మన పనితీరు ప్రజల మన్ననలు పొందేటట్లు ఉండాలని తెల్పుతూ ఎఆర్‌ అంటే పలు కీలక విభాగాల సమూహం అని ఇందులో జనరల్‌ డ్యూటీ లతో బాటు మోటార్‌ ట్రాన్స్పోర్ట్‌ వింగ్‌, సెక్యూరిటీ వింగ్‌, గన్‌ మ్యాన్‌ లు, డాగ్‌ స్క్వాడ్‌ మొదలైన ప్రత్యేక విభాగాలు ఉంటాయని తెలిపారు. విఐపి సెక్యురిటి, రక్షణ, ఆయుధాలను ఉపయోగించడం లో మెళకువలు, ఫైరింగ్‌ ప్రాక్టీసు, బందోబస్తు నిర్వహించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌, ఎంఒబి కంట్రోల్‌ వంటి అన్ని రకాల నైపుణ్యాలను నిరంతరం నేర్చుకొంటూ మన ఉద్యోగ నిర్వహణలో నిష్ణాతులుగా ఉండాలని, పోలీసు డిపార్టుమెంటు నందు వత్తి నైపుణ్యం నిరంతం పెంచుకోవడం చాలా అవసరమని తెలిపారు. ఎంఒబి సిబ్బంది ఉద్యోగ నిర్వహణ కష్ట తరమైందని, భాద్యతాయుతమైందని వారు నిర్వహించు ఎస్కార్టులు కానీ, బందోబస్తులు కానీ, గన్‌ మ్యాన్‌ ఉద్యోగం కానీ తగు జాగ్రత్త గా నిర్వహిస్తూ ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ఉద్యోగ నిర్వహణ చేయాలనీ, అందుకోసం శారీరకంగా మానసికంగా ధడంగా ఉండాలని, అలాగే ముఖ్యంగా ఏఆర్‌ పోలీసు సిబ్బంది క్రమశిక్షణకు మారు పేరుగా ఉండాలని ఎలాంటి చెడు నడవడికకు ఆస్కారం ఇవ్వకుండా బానిస కాకుండా ఉద్యోగ నిర్వహణ చక్కగా నిర్వహించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన స్పెషల్‌ పార్టీ మాబ్‌ ఆపరేషన్‌, బిడి టీం డెమో, డాగ్‌స్వాడ్‌ డెమోలను డిఐజి తిలకించి వారి నైపుణ్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.