ప్రజాశక్తి-వీకోట : ప్రజా సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేసిన వైకాపా ప్రభుత్వం ప్రజల దీవెనలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోమరల అధికారంలోకి వస్తుందని పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ్ తెలిపారు. మీ గడప వద్దకు మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా యాల కళ్ళు పంచాయతీ పరిధి గ్రామాల్లో వారు విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. నియోజక వర్గ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా రెవెన్యూ డివిజన్ ను పలమనేరు కు మంజూరు చేసినందుకు సహకరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వేసవిలో త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు ఆదేశించారు. గ్రామాల్లో నేతలకు మహిళలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ యువరాజ్ స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నార.










