Apr 06,2022 22:40

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అమరనాథ రెడ్డి

మాజీ మంత్రి అమరనాథ రెడ్డి
ప్రజాశక్తి- వి.కోట
: రాష్ట్రంలో అధికార వైసిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలే సరైన బుద్ధిచెప్పాలని మాజీ రాష్ట్ర మంత్రి అమర్నాథరెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని గోను మాకుల పల్లిలో బుధవారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ గౌరవసభ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక్క అవకాశం నినాదంతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం రివర్స్‌ పాలనతో ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టివేసి రాష్ట్రాన్ని దివాలా తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ చార్జీలు నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం శ్రేణులు పోరాడేందుకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు రామచంద్ర నాయుడు, రంగనాథ్‌, ఈశ్వర్‌, సోమశేఖర్‌, ధీరజ్‌, నాగభూషణం, విశ్వనాథ్‌ పాల్గొన్నారు.