Jul 02,2022 22:46

ప్రజాసంక్షేమానికే పెద్ద పీట..!: ఎమ్మెల్సీ భరత్‌
ప్రజాశక్తి- రామకుప్పం:
రాష్ట్రంలో పేద ప్రజల అభివద్దే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నేతత్వంలో ప్రభుత్వం కషి చేస్తోందని చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ భరత్‌ పేర్కొన్నారు. శనివారం మండలంలోని రాజుపేట పంచాయతీలో జరిగిన గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయ లేదా అని ఆరా తీశారు. స్థానికులు తెలిపిన సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించి, త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పిటిసి నితిన్‌ రాఘవ్‌ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ బాబురెడ్డి, యంపీపీ సుబ్రహ్మణ్యం, కోకన్వీనర్‌ చంద్రారెడ్డి, సర్పంచ్‌ నీలమ్మ బాలమురుగన్‌, ఎంపీటీసీ సౌందర్య ప్రభాకర్‌ రెడ్డి, ప్రచార కార్యదర్శి కేశవరెడ్డి, అజరురెడ్డి, ఆప్పీ, చెంగారెడ్డి, సుగుణప్ప, అరవింద్‌, రాజా, ఆనంద్‌, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.