Aug 15,2023 00:24

ప్రజాసమస్యలకు పరిష్కార వేదికగా 'స్పందన': ఎస్పీ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్‌పి రిషాంత్‌ రెెడ్డి ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్‌పి, అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ ఎల్‌.సుధాకర్‌, అడిషనల్‌ ఎస్పీ శ్రీలక్ష్మిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరిత గతిన విచారణ జరిపి ఫిర్యాదు దారులకి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మొత్తం 25 ఫిర్యాదులు అందాగా వరకట్న వేదింపులు 1, కుటుంబ తగాదాలు 1, వేధింపులు 3, ఇంటి తగాదాలు 3, భర్త వేధింపులు 1, భూ తగాదాలు 9, ఆస్తి తగాదాలు 1, డబ్బు తగాదాలు 3, ఎఫ్‌.ఐ.ఆర్‌. 3 ఉన్నాయి.
స్పందన కార్యక్రమంలో 10 వినతులు
నగరపాలక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మొత్తం 10 వినతులు అందినట్లు నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ తెలిపారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు పరిష్కరించాలని పలువురు నగర ప్రజలు వినతిపత్రాలు అందించారు. ప్రజల నుంచి అందిన వినతులపై శాఖాధిపతులు సత్వరం విచారించి చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ 4, టీపీవో 4, రెవెన్యూ 2 చొప్పున మొత్తం 10 వినతులు అందాయి. నగర పాలక అధికారులు పాల్గొన్నారు.
స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న జిల్లా ఎస్పీ