Jul 20,2022 22:28

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే
ప్రజాశక్తి- యాదమరి

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయమని పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్‌.బాబు పేర్కొన్నారు. బుధవారం కాశిరాల గ్రామపంచాయతీలోని గాంధీపురం, కాశిరాల, పెరుమాలపెంట, గ్రామాల్లో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికే సాధ్యమని తెలిపారు. కాశిరాల గ్రామంలోని ప్రతి గడపకు వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి వారి కుటుంబానికి ప్రభుత్వపరంగా అందుతున్న సంక్షేమపథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని విచారించారు. డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలని ప్రజలు వారి దష్టి తీసుకొచ్చారు. అర్హులైన వారికి పక్కాఇళ్ల మంజూరు చేయాలని కోరారు. సచివాలయ సిబ్బంది ప్రతిఒక్కరూ అర్హులైన వారికి సంక్షేమపథకాలు అందేలా చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వాటి అమలును వాలంటీర్లు సచివాలయ సిబ్బంది సక్రమంగా అమలయ్యే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వం మైనారిటీలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు సంక్షేమపథకాలను వారికి తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. జెడ్‌పి వైస్‌చైర్మన్‌ బి.ధనుంజయరెడ్డి, మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులు సురేష్‌బాబు, ఉపాధ్యక్షులు హరి నారాయణరెడ్డి, రవీంద్ర తహశీల్దార్‌ చిట్టిబాబు, ఎంపీడీవో శివరాజ్‌, ఎంపీటీసీ దుర్వాసులు, సర్పంచ్‌ రాధా మురళి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.