May 22,2023 21:55

సన్మానం పొందిన వాలంటీర్లతో ఎమ్మెల్యే పద్మావతి, జెడీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ

        ప్రజాశక్తి-శింగనమల   ప్రజాసేవలో ప్రతి వాలంటీర్‌ ఒక సైనికుడిలా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు అవార్డులు అందజేయడంతోపాటు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా జరుగుతున్న అభివృద్ధిని చూసి టిడిపి అధినేత తాను అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తామని చెబుతున్నారన్నారు. సేవ చేస్తున వాలంటీర్లను తొలగించి దోచుకునే జన్మభూమి కమిటీలను మళ్లీ తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. అయితే ఎవరూ ఖంగారు పడాల్సిన అవసరం లేదని, వచ్చేది కూడా వైసిపి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా ఆలోచించాలని, ప్రభుత్వ పథకాలన్నీ రావాలంటే తిగిరి జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, వైసిపి జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఎంపిపి యోగేశ్వరి, సింగిల్‌విండో ప్రెసిడెంట్‌ బొమ్మన శ్రీరామిరెడ్డి, యువ నాయకుడు ఆలూరు ఎర్రిస్వామిరెడ్డి, డిప్యూటీ తహశీల్దార్‌ ప్రకాష్‌రావు, ఎంపిడిఒ నిర్మలాకుమారి, సిడిపిఒ ఉమా శంకరమ్మ, నాయకులు ఎన్‌వి.నారాయణ, మల్లికార్జున్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, నాగవర్ధన్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, సర్పంచి నాగమణిమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉరవకొండ : ప్రజా రంజక పాలన అందించడంలో వాలంటర్లదే కీలకపాత్ర అని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం విడపనకల్‌ మండల కేంద్రంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న పథకాల అమలులో వాలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. ముఖ్యంగా జగన్‌ అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు వివరించారు. అనంతరం వాలంటీర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపి తలారి రంగయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు వీరన్న, ఎంపిపి కరణం పుష్పావతి భీమ్‌రెడ్డి, వైస్‌ ఎంపిపి మోదుపల్లి సునీతా రామాంజనేయులు, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ భరత్‌రెడ్డి, ఎంపిడిఒ శ్రీనివాసులు, తహశీల్దార్‌ బ్రహ్మయ్య, పిఎసిఎస్‌ ఛైర్మన్‌ శ్రీరాములు, విద్యా కమిటీ ఛైర్మన్‌ గిరిబాబు, మార్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్‌ రమేష్‌, ఎంఎల్‌ఒ కుళ్లాయిస్వామి, ఎస్సీ సెల్‌ జిల్లా నాయకులు సుంకన్న, సర్పంచులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.