Oct 28,2023 21:56

ఫొటో : పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వైసిపి నాయకులు

ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇంటి వద్దకే కార్పొరేట్‌ వైద్య సేవలను అందిస్తుందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ అన్నారు. శనివారం ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలోని ఎసిఎస్‌ఆర్‌ సచివాలయం 15, 16, 18వ వార్డులకు సంబంధించిన మెడికల్‌ క్యాంపును అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ ప్రాంగణంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ సిబ్బంది వారి శాఖ ద్వారా పౌష్ఠికాహారం స్టాల్‌ను పరిశీలించారు.
వైస్‌చైర్మన్‌ సర్దార్‌ మాట్లాడుతూ ఈరోజున జరిగిన వైద్య శిబిరంలో దాదాపుగా 430 మందికి ఉచిత వైద్యసేవలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ బి.నాగేశ్వరరావు, కౌన్సిలర్లు చెరుకూరు కామాక్షయ్య నాయుడు, సూరా భాస్కర్‌ రెడ్డి, కొప్పోలు రమాదేవి, పుచ్చలపల్లి రాధిక, మహబూబ్‌ బాషా, గందళ్ల వేణు, వైసిపి నాయకులు కొప్పోలు చిన్నపరెడ్డి, సయ్యద్‌ జమీర్‌, ముజ్జు, డాక్టర్‌ ప్రణీత్‌, పద్మనాభ రెడ్డి, ఆర్‌ఐ ఖాసీమ్‌, మున్సిపల్‌ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఐ.సి.డి.ఎస్‌. సిబ్బంది, వార్డు వలంటీర్లు పాల్గొన్నారు.