Oct 06,2023 21:20

ఫొటో : సురక్ష కార్డును అందజేస్తున్న ఎంపిపి వేణుగోపాల్‌రెడ్డి

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపేట
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : రాష్ట్రంలో ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పెద్దపీట వేస్తున్నాడని ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కరటంపాడు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి, జెడ్‌పిటిసి పి.ప్రసన్నలక్ష్మి పాల్గొని మాట్లాడారు. సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రతిఒక్కరికీ గ్రామ స్డాయిలోనే రోగ నిర్థారణ పరీక్షలు నిర్వహించి వారికి అవసరమయ్యే మందులు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని రూపొందించారని తెలియజేశారు.
ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలోని వైద్య సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా తెలిపారు. జెసిఎస్‌ కోఆర్డినేటర్‌ వల్లభనేని రాజేంద్ర మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సిఎం జగన్మోహన్‌ రెడ్డి పేద ప్రజల ఆరోగ్య దృష్ట్యా వారికి మంచి వైద్యం అందించాలని ఉద్దేశంతో ఈ జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఇది ప్రజలందరూ ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రేవతి, ఎంపిడిఒ పి.ఐజాక్‌ ప్రవీణ్‌, ఎఒ కె.శ్రీనివాసరావు, డాక్టర్లు అనూష, దేవానంద్‌, స్పెషలిస్ట్‌ డాక్టర్లు ఇఒ (పిఆర్‌అండ్‌ఆర్‌డి), సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, ప్రజలు పాల్గొన్నారు.