Oct 21,2023 23:12

మాట్లాడుతూ ఎమ్మెల్యే కిరణ్‌ కుమార్‌

ప్రజాశక్తి- లావేరు: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి సిఎం జగన్మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని గురుగుబిల్లి గ్రామంలో ఉపాధిహామీ నిధులు రూ.17.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వైఎస్‌ఆర్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అందులో భాగంగానే పిహెచ్‌సిలతో పాటు వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేందకు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేసిందన్నారు. చిన్నచిన్న వ్యాధులకు గ్రామాల్లోనే ఈ క్లినిక్‌లు ద్వారా వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జెడ్‌పిటిసి మీసాల సీతంనాయుడు, జెసిఎస్‌ ఇన్‌ఛార్జి మీసాల శ్రీనువాసరావు, సర్పంచ్‌ బాడిత కల్యాణి, ఎంపిడిఒ కుప్పలి సురేష్‌కుమార్‌, వైసిపి నాయకులు బాడిత రాంబాబు పాల్గొన్నారు.