ప్రజాశక్తి-అనంతపురం సిటీ ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం అనంతపురము రూరల్ మండలం ఎ.నారాయణపురం మసీదు వద్ద వాల ంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహి ంచారు. ఇందులో భాగంగా ప్రతిభ కన బరిచిన వాలంటీర్లకు సేవారత్న పథకా లను అందజేసి ఘనంగా సన్మానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రతి పేదవారికీ సంక్షేమ పథకాలు అందించ డమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోపాటు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని సిఎం జగన్ సచి వాలయం, వాలంటరీ వ్యవస్థలను తీసుకొచ్చారన్నా రు. ఆయా వ్యవస్థల ద్వారా అవినీతి రహితంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎంపిపి వరలక్ష్మి ఈశ్వరయ్య, ఎంపిడిఒ బాబా ఫక్రుద్దీన్, విస్తరణ అధికారి అలివేలమ్మ, పంచాయతీ కార్యదర్శులు అశోక్‌బాబు, ముత్యాలరెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి










