Jun 28,2023 21:37

ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి

      గుత్తి : ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని ఇసురాళ్లపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం సర్పంచి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, గుంతకల్లు మున్సిపల్‌ వైస్‌ ఛైౖర్‌ పర్సన్‌ నైరుతిరెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్‌ పాటుపడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటేసి మరోసారి వైసిపిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి జి.విశాలాక్షి, తహశీల్దార్‌ మహబూబ్‌బాషా, ఎంపిటిసి చిన్న వీరన్న, నాయకులు బి.శ్రీనివాసరెడ్డి, కె.మధుసూదన్‌రెడ్డి, బేడల వెంకట్రాముడు, వై.సుభాష్‌రెడ్డి, మల్లయ్యయాదవ్‌, రంగయ్య, రాజన్న, గురుప్రసాద్‌, పుల్లారెడ్డి, శేషారెడ్డి, రాముయాదవ్‌, లాలునాయక్‌, హనుమంతు, చంద్ర, మల్లికార్జున, కౌన్సిలర్లు వరదరాజులు, ఫారుక్‌, వాల్మీకి శివ, తదితరులు పాల్గొన్నారు.