Jul 20,2022 22:26

ప్రజా సంక్షేమమే లక్ష్యం.. ఎమ్మెల్సీ భరత్‌
ప్రజాశక్తి- రామకుప్పం

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజల సంక్షేమం కోసం నవరత్నాలు పథకం అమలు చేసి విజయవంతంగా పేదలకు వాటీ ఫలాలను అందిస్తున్నరని, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ వైసిపి బాధ్యులు భరత్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని వీర్నమల పంచాయతీలో గడపగడపకు మీఎమ్మెల్సీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం వారికి అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో రామకుప్పం ఎంపీపీ సుబ్రహ్మణ్యం, జెడ్పిటిసి నితిన్‌ రాఘవరెడ్డి, మండల వైసిపి కన్వీనర్‌ విజలాపురం బాబురెడ్డి, కో-కన్వీనర్‌ చంద్రారెడ్డి, నాగిరెడ్డి, మురళి, చంద్ర మోహన్‌రెడ్డి, మునెమ్మ, రవినాయక్‌, మోహన్‌ నాయక్‌, భాస్కర్‌ నాయక్‌, మండల ప్రచార కార్యదర్శి కేశవరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.