Mar 03,2023 21:02

ప్రజాశక్తి - పెనుగొండ
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం సిద్ధాంతం గ్రామంలోని లక్కపేట, అరుంధతిపేటలో 141 రోజు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్‌ఎ శ్రీరంగనాథరాజు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇంటింటా సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంబిసి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వీరన్న, జెడ్‌పిటిసి గోవర్ధన్‌, సర్పంచి చింతపల్ల గన్నిరాజు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.