Mar 15,2022 22:45

మోహిత్‌రెడ్డిని సన్మానిస్తున్న దృశ్యం


''సచివాలయ బాట'' లో ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌్‌ రెడ్డి
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సద్వినియోగం కావాలని సూచించారు. మంగళవారం తిరుపతి రూరల్‌ మండల పరిధిలోని మల్లంగుంట, కే.సి. పేట, వేదాంతపురం, ఓటేరు, తనపల్లి, కుంట్రపాకం, తిరుచానూరు పంచాయతీల లో సచివాలయ బాట నిర్వహించారు. ఇందులో భాగంగా సంక్షేమ పథకాల అమలు, అభివద్ధి పనుల పురోగతి పై సమీక్షించారు. అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో పనుల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి రూరల్‌ మండలం పరిధిలో ఒక్కో పంచాయతీ అభివద్ధికి రూ. కోటి చొప్పున మంజూరు చేసినట్లు వెల్లడించారు. సమావేశ మందిరాలు, గ్రంథాలయాలు, పార్కులు, సీసీ రోడ్ల ప్రజా సమస్యలపై సత్వరం స్పందించి పరిష్కరించాలి తెలియజేశారు. మీ పరిధిలో పరిష్కారం కాని సమస్యలను నా దష్టికి తీసుకురావాలని ఎంపీపీ మోహిత్‌ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పద్మనాభరెడ్డి వైస్‌ఎంపీపీలు విడుదల మాధవరెడ్డి, యశోద, ఎమ్మార్వో లోకేశ్వరి, ఎంపిడిఓ వెంకట నారాయణ, పంచాయతీ కార్యదర్శి మురళి ఆయా పంచాయతీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.